calender_icon.png 29 July, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు నకిలీ వైద్యులపై కేసులు నమోదు

28-07-2025 10:20:33 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ భీమారంలో ఇందిరగాంధీ విగ్రహం దగ్గర సిరి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకుడు బి.కృష్ణ ప్రసాద్(ల్యాబ్ టెక్నీషియన్ ), భీమారంలో శ్రీ బాలాజీ క్లినిక్ నిర్వాహకుడు ఆర్.శ్రీకాంత్(ల్యాబ్ టెక్నీషియన్), జవహర్ నగర్ ప్రాంతంలో మై హెల్త్ హాస్పిటల్ నిర్వాహకుడు కె.శరత్ కుమార్(బి ఫార్మసీ, గవర్నమెంట్ ఉద్యోగి)లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ డి. లాలయ్య కుమార్, చైర్మన్ డాక్టర్ కె.మహేష్ కుమార్ ల ఫిర్యాదు మేరకు ఎన్ఎంసి చట్టం 34, 54, టిఎస్ఎంపిఆర్ చట్టం 22, బిఎన్ఎస్ 318, 319 ప్రకారం కేయూ పోలీసు స్టేషన్లో కేసు ఎఫ్.ఐ.ఆర్(420/2025, 421/2025 422/2025) కేసులు నమోదు చేశారు.

తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ లేని వ్యక్తులు ఎవరు కూడా అల్లోపతి, మోడర్న్ మెడిసిన్ వైద్య సేవలు అంధించరాదని ప్రథమ చికిత్స కేంద్రం ముసుగులో ఆశాస్త్రియ పద్ధతులలో ఇష్టంవచ్చిన ఆంటీబయోటిక్, స్టేరాయిడ్, నొప్పి ఇంజెక్షన్స్ వేయడం, ల్యాబ్ టెస్ట్ లు నిర్వహించడం, సెలైన్లు పెట్టడం, హాస్పిటల్ వలె బెడ్స్ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసి, ప్రజారోగ్యం దెబ్బతీసే వారిపై చట్ట పరమైన చర్యలు తీస్కుంటామని వీరికి ఒక సంవత్సరం జైలు శిక్ష,  5 లక్షల వరకు జరిమానా విధిస్తారని, రెండవ సారి కేసు నమోదు అయితే 3 సంవత్సరాలు జైలుశిక్ష వేస్తారని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేష్ కుమార్ తెలియ జేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని, నకిలీ వైద్యుల పైన 91543 82727 నెంబర్ కి వాట్సాప్ ద్వార సమాచారం  ఇవ్వాలని తెలియ జేశారు.