calender_icon.png 29 July, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీల్లో పతకాలు

28-07-2025 10:29:13 PM

జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ ఎల్బి స్టేడియంలోని బ్యాట్మింటన్ హాలులో ఈనెల 26, 27న నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ 2025-26 పోటీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన షావోలిన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ(Shaolin Dragon Martial Arts Academy) విద్యార్థులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ మాస్టర్ మాదాసి శ్రీనివాస్(కరాటే) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హెచ్ ఎస్ విభాగంలో ఆరాధ్య బంగారు పతకం, పీఎఫ్ విభాగంలో కాంస్య పతకం, హెచ్ ఎస్ డబ్ల్యూ విభాగంలో హరిణి రజత పతకం, పీఎఫ్ విభాగంలో విధిష దేవి కాంస్య పతకం, పీఎఫ్, సీఎఫ్ డబ్ల్యూ విభాగాలలో సంజన శ్రీ కాంస్య పతకాలు, పీఎఫ్ విభాగంలో హరిణి కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. తెలంగాణా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్ మాస్టర్ శ్రీనివాస్ కు ఖేలో ఇండియా ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. బాలికలకు కిక్ బాక్సింగులో శిక్షణ ఇస్తూ మహిళల క్రీడల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు.