28-07-2025 10:12:12 PM
అలంపూర్: అలంపూర్ ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాల(Sri Jogulamba Bala Brahmeswara Temple)ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పోస్టల్ చీఫ్ జనరల్ పీపీఎస్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈవో పురేంద్ర కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచన మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు.