28-07-2025 10:25:46 PM
ఎమ్మెల్యే మందుల సామేలు
మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. సోమవారం మండలంలోని జాజిరెడ్డిగూడెం, బొల్లంపల్లి, అడివేంల గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్(Collector Tejas Nandalal Power)తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ.1400 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ నూతన భవనానికి రూ.20 లక్షలతో పాటు అదనంగా మరో రూ.10 లక్షలు మంజూరు చేసి త్వరితగదన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని చెప్పారు.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200యూనిట్ల ఉచిత కరెంటు,ఇందిరమ్మ ఇండ్లు,నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు.గ్రామంలోని యోగానంద లక్ష్మి నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి,డీసీసీ ఉపాధ్యక్షులు ధరూరి యోగానందచార్యులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష,ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్రెడ్డి,నర్సింగ శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం,పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్, జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి, భైరబోయిన సైదులు, మహారాజు,బీరెల్లి శ్రీధర్ రెడ్డి, తహశీల్దార్ భాషపాక శ్రీకాంత్,ఎంపీడీఓ గోపి, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.