28-07-2025 10:07:56 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ శివారులోని గుడిసెలో సోమవారం మధ్యాహ్నం కొంతమంది వ్యక్తులు కలిసి జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ ఎం. మోతిరామ్ సిబ్బందితో కలిసి దాడి చేయగా 8 మంది వ్యక్తులు జూదమాడుతూ పట్టుపడ్డారు. వారి వద్ద నుండి 8 మొబైల్ ఫోన్స్, 6 ద్విచక్ర వాహనాలు, ప్లేయింగ్ కార్డ్స్, రూ. 4,630 నగదును సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.