calender_icon.png 8 May, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి అభినందనలు: రాజ్‌నాథ్ సింగ్

08-05-2025 05:26:59 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లో జరిగిన ప్రహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారత పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా నిన్న జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలను మనసైన్యం ధ్వసం చేసిందని,  పాకిస్థాన్ లోని 9 ఉగ్రస్థావరాలను కచ్చితత్వంతో గుర్తించి విజయవంతంగా ధ్వంసం చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ ఘటనలో 9 ఉగ్రస్థావరాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల హతమయ్యారని స్పష్టం చేశారు. దాడుల్లో అమాయకులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడంతో మన సైనికులు చూపిన ధైర్యసాహసాలు గర్వకారణమన్నారు.

దీంతో పాక్ ఉగ్రవాదాన్ని ఔట్ సోర్సింగ్ చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్  పేర్కొన్నారు. భారత్ బలగాలతో  అత్యంత నాణ్యమైన ఆయుదాలున్నాయని, సైనిక సంపత్తిలో రాశి-వాసి పరంగా మెరుగయ్యామన్నారు. ఆయుధ తయారీలో భారత్ చాలా వరకు స్వయంసమృద్ధి సాధించి ప్రపంచ మార్కెట్ లోకి అడుగుపెడుతుందన్నారు. రూ.24 వేల కోట్ల విలువైన ఆయుధాలు ఎగుమతి చేస్తున్నామని, దీంతో ఆయుధాల ఎగుమతి విలును రూ.50 వేల కోట్లకు తీసుకెళ్లాలని సూచించారు. ఆయుధ తయారీలో నాణ్యత పెంచేందుకు ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి వినియోగిస్తున్నామని, భారత ఆయుధాల సంపత్తి గొప్పతనాన్ని ప్రపంచం త్వలోనే గుర్తిస్తుందని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.