08-05-2025 07:56:04 PM
వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేసిన విద్యుత్ అధికారులు...
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామ శివారులో విద్యుత్ స్తంభాలు వంగి ప్రమాదకర స్థితిలో ఉండడంతో విజయక్రాంతి పత్రికలో ఏప్రిల్ 27వ తేదీన 'వంగిన విద్యుత్ స్తంభాలు.. పొంచి ఉన్న ప్రమాదం' అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు గురువారం విద్యుత్ స్తంభాన్ని సరిచేసి, విద్యుత్ తీగలను సరి చేశారు. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులను అభినందిస్తున్నారు.