calender_icon.png 9 May, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపులు: వ్యోమిక సింగ్

08-05-2025 07:56:00 PM

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి సెక్టార్లలోని ప్రాంతాలలో పాకిస్తాన్ మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఆర్టిలరీలను ఉపయోగించి యంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు జరుపుతుందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ పేర్కొన్నారు. పాక్ దాడులతో భారత్ కు ప్రతిదాడులు చేయక తప్పని పరిస్థితి అని, దాయాదుల కాల్పుల కారణంగా ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. పాకిస్తాన్ నుండి మోర్టార్, ఆర్టిలరీ కాల్పులను ఆపడానికి భారతదేశం స్పందించవలసి వచ్చిందన్నారు. పాకిస్తాన్ సైన్యం ఉద్రిక్తతలను తగ్గించే వరకు భారత సాయుధ దళాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వివరించారు.