08-05-2025 07:44:50 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాథ్స్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పొదెం భద్రయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో గురువారం మృతి చెందారు. ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ గ్రామం. ఆయన మృతి పట్ల మండల విద్యాశాఖాధికారి అజ్మీరా జగన్, ఏటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ళ శ్రీనివాసరావులు సంతాపం వ్యక్తం చేశారు.