6 August, 2026 | 2:30 PM

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

06-08-2026 01:20 PM

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో(Secretariat) నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మంత్రి సీతక్క(Minister Seethakka) భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయానికి చేరుకున్న మంత్రి సీతక్కకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికి, సంప్రదాయ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను సచివాలయ ప్రాంగణంలో భక్తి భావంతో జరుపుకున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.