6 August, 2026 | 2:52 PM

క్షుద్రపూజల కామెంట్స్ హరీష్ రావు స్పందన

06-08-2026 01:30 PM

క్రిమినల్ , పరువు నష్టం దావా వేస్తా

స్కామ్ లు బయటపెడుతున్నానే నన్ను టార్గెట్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) అధ్యక్షుడు మహేష్ గౌడ్(Mahesh Goud) చేసిన క్షుద్రపూజల కామెంట్స్ పై మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) స్పందించారు. క్షుత్రపూజలు చేస్తున్నానంటూ తనపై నిందలు వేశారని మండిపడ్డారు. బట్ట కాల్చి మీద వేస్తే వదిలే ది లేదని హెచ్చరించారు. క్షుద్ర పూజలు చేశానని కామెంట్ చేసిన వారందరిపై క్రిమినల్, పరువు నష్టం దావా వేస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎదుర్కునే సత్తాలేక తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్కామ్ లు బయటపెడుతున్నానే తనను టార్గెట్ చేశారని తెలిపారు.