ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్
06-08-2026 01:40 PM
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని(Trainee IPS Uday Case) పోలీసులు విచారిస్తున్నారు. కోర్టు ఉదయ్ ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు(Women's Safety Wing officials) ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు(Chanchalguda Jail) నుంచి అర్ధరాత్రి కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు. డీసీపీ లావణ్య పర్యవేక్షణలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో గత నెల 28న ఉదయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కస్టడీ విచారణలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించనున్నారు.






