6 August, 2026 | 3:36 PM

తెలంగాణ సిద్ధాంత కర్తకు ఘన నివాళి

06-08-2026 02:18 PM

బిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ సిద్దాంత కర్త నాలుగు కోట్ల ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రేకేత్తించి పోరాటానికి సిద్ధం చేసిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని మాజీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. జయశంకర్ జయంతి(Jayashankar Birth Anniversary Celebrations) సందర్బంగా గురువారం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు తెలియచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ మండల నాయకులు గోపగాని రమేష్. తడకమళ్ల రవికుమార్ సర్పంచ్ లు తప్పేట్ల ఎల్లయ్య. చింతకుంట్ల మనోజ్ నాయకులుకుంటపెల్లి సుధాకర్, నల్లబెల్లి వెంకటేష్. బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లిఖార్జున్. అఖిల్. సురేష్. మధు. తదితరులు పాల్గొన్నారు,