6 August, 2026 | 2:25 PM

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలే మాకు స్ఫూర్తి

06-08-2026 01:15 PM

 చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాలనర్సయ్య 

చేర్యాల, ఆగస్టు 06: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి(Kothapalli Jayashankar Birth Anniversary Celebrations) సందర్భంగా చేర్యాల పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పురపాలక సంఘ చైర్‌పర్సన్ ముస్త్యాల అరుణ బాలనర్సయ్య ,మున్సిపల్ కమిషనర్ ఎస్.నాగేందర్, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చైర్‌ పర్సన్ ముస్త్యాల అరుణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు ఆయన చూపిన మార్గంలో ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించారు.