calender_icon.png 13 December, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

09-08-2025 02:18:25 PM

అన్న చెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతి రూపం రాఖీ పండుగ అన్న మంత్రి

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి(Raksha Bandhan) పురస్కరించుకొని శనివారం నాడు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రుల నివాస సముదాయంలో ఆయనకు రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీతక్క తనకు సొంత సోదరి లాగా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) తన ఆప్యాయతను వ్యక్తం చేశారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు.