09-08-2025 02:14:17 PM
హైదరాబాద్: కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలని కంకణం కట్టుకున్న ఈ చేయికి రాఖీ కట్టడం నా అదృష్టం అని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సోదరుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) సంకల్పం నెరవేరి, తెలంగాణ ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని సీతక్క తెలిపారు. ''అక్షరాలతో రచించలేనిది… మాటలతో నిర్వచించలేనిది… సీతక్కతో నా అనుబంధం… ప్రతి రాఖీ పౌర్ణమి(Raksha Bandhan) నాడు… ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుంది.'' అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు.