24-12-2025 10:20:40 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని మొరంపల్లి బంజర్ గ్రామంలోని స్టెల్లా మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాష్ బిషప్,ఎంఈఓ యదుసింహారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు,నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
అనంతరం ప్రకాష్ బిషప్ మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలన్నారు. వచ్చే ఏడాది నుండి ఏడవ తరగతి వరకు ఉన్న పాఠశాలను పదవి తరగతికి అప్డేట్ చేయునుట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుమలతను ఆయన అభినందించారు.అనంతరం పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో బిషప్ సెక్రెటరీ విజయ్, ఫాదర్ ఆంటోనీ,టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.