04-12-2025 01:51:56 AM
గత పుణ్యం వల్లే తల్లులకు సేవ చేసే అదృష్టం దక్కింది
జిల్లా ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాథ్
ములుగు,డిసెంబర్3(విజయక్రాంతి) ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జ నవరి నెలలో నిర్వహిస్తున్న మేడారం మహా జాతర విజయవంతం కోసం అవసరమైన సమన్వయ చర్యలపై జిల్లా ఎస్పీ కేకాన్ సు ధీర్ రామనాథ్ ఈరోజు పూజార్లతో మరి యు అభ్యుదయ సంఘం యువతతో స మావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ,ఇది మన జాతర& అందరం ఒక జట్టు లా కలిసి పనిచేస్తేనే జాతర విజయవంతమవుతుంది. గత పుణ్యం వల్లే ఈ జాతరలో తల్లులకు సేవ చేసే అదృష్టం మనందరికీ లభించింది అని అన్నారు.
సమన్వయం భద్రతపై కీలక సూచనలు
పూజారులు, యువత కోసం ప్రత్యేక పాసులు జారీ చేసి పూజారులు, యువత, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం లేకుండా కృషి చేస్తానని సూచించారు.ఈ సంవత్సరం మేడారం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతుండటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకా శం ఉందన్నారు ఇందుకోసం 10,000 మందికిపైగా పోలీసులతో పటిష్టమైన బం దోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్తో సమీక్షించి, పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తయ్యేలా విజ్ఞప్తి చేస్తానని ఎస్పీ అన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ ఏర్పాట్లు
గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు పార్కింగ్ సమస్యలు లేకుండా మెరుగైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు సులభంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.పూజారులు, యువత, మేడారం ప్రజలు, పోలీసులు అందరూ ఒక కుటుంబంలా కలిసి పనిచేసి, ఆచార సాంప్రదా యాలను పాటిస్తూ ఒక కుటుంబం లా పని చేసి మహా జాతరను విజయవంతం చేయాలనీ ఎస్పీ పిలుపునిచ్చారు.