calender_icon.png 21 May, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంపై కమిషనర్ తన పని తాను చేసుకుపోతుంది..

20-05-2025 11:25:40 PM

కేసిఆర్ నోటీసులపై ప్రభుత్వానికి సంబంధం లేదు.. మంత్రి శ్రీధర్ బాబు స్పందన

మంథని (విజయక్రాంతి): కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషనర్ తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. మాజీ సీఎం కేసిఆర్(KCR), మాజీమంత్రులు హరీష్ రావు, రాజేందర్ లకు కమిషనర్ నోటీసులు ఇవ్వడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంగళవారం మంత్రి స్పందిస్తూ... కమిషనర్  నోటీసులివ్వడంపై ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషనర్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తుందని, కాళేశ్వరం విషయంలో ఎవరెవరిని విచారించాలో వారికి తెలుసని మంత్రి అన్నారు.