21-05-2025 12:00:00 AM
ఎస్‌ఐ చంద్రశేఖర్
భూత్పూర్, మే 20 : మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్త్స్ర. చంద్రశేఖర్ తెలిపారు. ఈ సంద ర్భం గా మంగళవారం తాటిపర్తి గ్రామంలో మైనర్లు వాహనాలు నడుపుతున్నడం చూసి వారికి, వారి తల్లిదండ్రులకు పిలిచి కౌన్సి లింగ్ ఇచ్చారు. మైనార్లకు వాహనాలు ఇస్తే వాహనం యజమాన్యంపై, మైనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
వాహనాలు అతివేగంగా నడపడంతో పలు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అదేవిధంగా ఎస్త్స్ర వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలీ సులు తదితరులు ఉన్నారు.