26-07-2025 12:14:49 AM
పెద్ద అంబర్‌పేట్ తారా కన్వెన్షన్‌లో లబ్దిదారులకు రేషన్ కార్డుల పంపిణీ
అబ్దుల్లాపూర్‌మెట్, జులై 25: రాష్ట్ర ఐటీశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేడు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీకి రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రం గారెడ్డి విచ్చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ తారా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఐటీశాఖ, ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డుల అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయినా లబ్దిదారులు శనివారం 03:00 గంటలకు వరకు తారా కన్వెన్షన్ హాల్ కు రావాలని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఓ ప్రకటనలోతెలిపారు.