26-07-2025 12:16:13 AM
జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజు భూపాల్ గౌడ్
షాద్ నగర్, జులై 25: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం కావాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజు భూపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్ని కల తో పోల్చుకుంటే నియోజకవర్గంలో బీజేపీ పార్టీ సత్తా చాటిందని ఆయన గుర్తు చేశారు. అ దే స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు సర్పంచులు,ఎంపిటిసిలుగా మెజార్టీగా గెలుపొందాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. క్షేత్రస్థాయిలో ఎక్కడ కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆయన విమర్శించారు.
రాజకీయ కోణంలోనే బీసీల కు 42 శాతం రిజర్వేషన్ల అంటూ బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ జనగణనకు శ్రీకారం చుట్టడం గొప్ప నిర్ణయమని ఆయన కితాబునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు శ్రీ వర్ధన్ రెడ్డి, నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, పిట్టల సురేష్, శ్రీనివాస్, వంశీకృష్ణులు పాల్గొన్నారు.