07-04-2025 12:15:15 AM
అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ఎల్బీనగర్, ఏప్రిల్ 5: ఎల్బీనగర్ నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా మంత్రి చైతన్యపురికి వస్తారు. శివాజీ విగ్రహం నుంచి భారీ బైక్, కార్ల ర్యాలీతో మంత్రి పర్యటన ప్రారంభమవుతుంది.
కొత్తపేట - మోహన్ నగర్ రోడ్డు లోని సప్తగిరి కాలనీ, లింగోజిగూడ డివిజన్లోని సీఎం రోడ్ (గౌతమ్ నగర్), మన్సూరాబాద్ డివిజన్లోని సహారా స్టేట్స్ రోడ్, వనస్థలిపురం డివిజన్లోని క్రిస్టియన్ కాలనీ, హస్తినాపురం జడ్పీ రోడ్ పార్క్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు.