calender_icon.png 16 May, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరేకృష్ణా గోల్డెన్ టెంపుల్‌లో సీతారాముల కల్యాణోత్సవం

07-04-2025 12:16:44 AM

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని హరేకృష్ణా గోల్డెన్ టెంపుల్‌లో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పుష్పాలు చల్లుతూ, పల్లకీ ఊరేగింపును దర్శించి ఆనంద పరవశంలో మునిగితేలారు.

హరేకృష్ణా మూమెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్ ప్రభు శ్రీరాముడి దివ్య లీలలు, ధర్మాచరణం, జీవితానికి అందించే మార్గదర్శకత గురించి గొప్ప ఉపన్యాసాన్ని అందించారు. నార్సింగిలో నిర్మాణంలో ఉన్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్ట్ వద్ద కూడా ఉత్సవాలు భక్తిపూర్వకంగా నిర్వహించబడ్డాయి.