calender_icon.png 15 August, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో రైతు మృతి

07-04-2025 12:15:01 AM

నల్లగొండ, ఏప్రిల్ 6 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. మిర్యాలగూడ మండలం దుబ్బతండా గ్రామానికి చెందిన మాలోతు భద్రు (60) శ్రీనివాసనగర్ శివారులోని మాలోతు బాలు పొలం వద్ద ఉదయం పచ్చగడ్డి కోసేందుకు వెళ్లాడు.

బోరుబావి పక్కనే గడ్డి కోస్తుండగా కొడవలి స్టార్టర్ నుంచి బోరుమోటర్కు వెళ్లే తీగకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లి చూడగా భద్రు విఘతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.