22 June, 2026 | 3:49 AM

న్యూ స్టార్ చిల్డ్రన్స్ హాస్పటల్ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తుమ్మల

22-06-2026 02:13 AM

సత్తుపల్లి, జూన్ 21 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలో గత నాలుగు రోజులు క్రితం ప్రారంభించబడిన న్యూ స్టార్ చిల్డ్రన్స్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ యాజమాన్యానికి రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లిలో హాస్పటల్ ను సందర్శించి డాక్టర్ సురేష్ రామాలకి తన అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెంట స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ తోపాటు కాంగ్రెస్ నాయకులుపట్టణ ప్రముఖులు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు తో పాటు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.