హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి గురువారం మధ్యాహ్నం అమరావతిలో భేటీ అయ్యారు. కేవలం మర్యాద పూర్వకంగానే కలిసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడిని ఈ సందర్భంగా ఉత్తమ్ దంపతులు అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావం, నీటిపారుదలకు సంబంధించిన అంశాలు చర్చించినట్లు తెలిసింది.