31-05-2025 12:52:07 AM
మంథని మే 30(విజయ క్రాంతి) రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు జన్మదినం వేడుకలను శుక్రవారం మంథని పట్టణంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నల్మాస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేసి కార్మికులకు మహిళలకు చీరలు, మగవాళ్లకు లుంగీలు, టవల్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, డివిజన్ చైర్మన్ ముస్తాల దామోదర్, ప ట్టణ సంఘం గౌరవ అధ్యక్షులు ఒల్లాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కి శెట్టిరమేష్, కోశాధికారి రావికంటి మనోహర్, ఆలయ చైర్మన్ కొత్త శ్రీనివాస్, సభ్యులు రావికంటి సదానందం, ఒ ల్లాల నాగరాజు, రాచర్ల నాగరాజు కొమురవెల్లి సత్యనారాయణ రావికంటి చంద్రమౌళి మేఘశ్యామ్ కొంచెం వెంకటేశ్వర్లు, కొమురవెల్లి రాజు, ఎల్లంకి కేదారి,ఎల్లంకి ప్రభాకర్ పాల్గొన్నారు.