15-11-2025 10:59:22 AM
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో(Husnabad) మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ మెట్టు సాయి శనివారం నాడు పర్యటించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రులు ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలు వదిలారు. హుస్నాబాద్ పట్టణంలో శిథిలావస్థకు చేరిన పశువుల వైద్యశాలను పరిశీలించారు. పశువుల వైద్యశాలను ఆధునీకరించి అభివృద్ధి చేయాలని పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. హుస్నాబాద్ పశు వైద్యశాలను పరిశీలించి ఆధునీకరిస్తామని వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారని పొన్నం పేర్కొన్నారు. హుస్నాబాద్ పర్యటనలో భాగంగా స్థానిక ఫిష్ మార్కెట్ పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి వ్యాపారం లావాదేవీ, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. త్వరలోనే హుస్నాబాద్ లో అత్యాధునిక మోడర్న్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి మత్స్యకారులకు హామీ ఇచ్చారు.