27-07-2025 12:49:18 AM
‘హను ఫేమ్ తేజ సజ్జా ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన చిత్రం ‘మిరాయ్’లో సూపర్ యోధగా అలరించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మనోజ్ మంచు విలన్‌గా కనిపించనున్నారు.
శ్రియ శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా టీమ్ మొదటి సింగిల్ ‘వైబ్ ఉంది’ని విడుదల చేసింది. ట్రెండీ టచ్‌తోపాటు చిన్న క్లాసికల్ హింట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని రెండిటినీ కనెక్ట్ చేసేలా ఉంది గీతం. గౌర హరి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.