calender_icon.png 27 July, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ కారణాలు బయటకొస్తాయ్: క్రిష్

27-07-2025 12:50:35 AM

పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘హరిహర వీరమల్లు’. గత గురు వారం విడుదలైన ఈ  సిని మా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంటోంది. తొలుత ఈ ప్రాజెక్టు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం కాగా, మధ్యలోనే ఆయన తప్పుకోవా ల్సి వచ్చింది. తర్వాత దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న జ్యోతికృష్ణ ఎట్టకే లకు సినిమాను పూర్తిచేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ డైరెక్టర్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది సరైన కారణమైతే తెలుపలేదు.

అనివార్య కారణాలు అంటూ ఇంత కాలం అసలు విషయాన్ని గుట్టుగా ఉంచినట్టు తాజా పరిణామలను బట్టి అర్థమవుతోంది. సినిమా విమర్శలు ఎదుర్కొంటున్న నేప థ్యంలో తాజాగా తనను సంప్రదించిన ఓ మీడియా సంస్థతో డైరెక్టర్ క్రిష్ మాట్లాడినట్టు తెలుస్తోంది. తాను ప్రాజెక్టును మధ్యలోనే వదిలేయడం గురిం చి క్రిష్ స్పందిస్తూ ఇందు కు గల కారణాలు త్వరలోనే బయటకు వస్తాయ ని ఈ సందర్భంగా చెప్పినట్టు సమాచారం. అయితే తనకు పవన్ కల్యాణ్‌తో ఎలాంటి విభేదాలు లేవని క్రిష్ స్పష్టం చేశారట. ‘నాకు, పవన్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవు. నేను ఓపెన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేసేందుకు కూడా సిద్ధమే’ అని క్రిష్ కుండబద్ధలు కొట్టారట.