calender_icon.png 27 July, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిలీజ్ చేయడమే సక్సెస్.. ప్రేక్షకులకు నచ్చితే బోనస్

27-07-2025 12:48:07 AM

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదలైంది. హీరో సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్.

ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి. మన ఆలోచనల్ని దేశం మొత్తం చెప్పడానికి బెస్ట్ ప్రాసెస్ సినిమానే. ఫేమస్ అవ్వాలనుకుంటే రీల్స్ చేసి కూడా ఫేమస్ అవ్వచ్చు” అన్నారు. డైరెక్టర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. “ఒక దేశభక్తి సినిమా తీస్తూ చైనా పీస్ అనే పేరు పెట్టడం వెరీ చాలెంజింగ్. మేము అన్ని విభాగంలోనూ జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా సినిమాను తీర్చిదిద్దాం” అన్నారు.

హీరో నిహాల్ మాట్లాడుతూ.. “నేను జగడంతోపాటు దాదాపు 20 సినిమాలకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశాను. అవన్నీ కూడా స్కూల్ బంక్ కొట్టడానికి చేశాను. కానీ యాక్టింగ్ అంటే మజా వచ్చింది. ఒక నమ్మకంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను” అన్నారు. హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మాట్లాడుతుంది. అందరికీ  బాగా రీచ్ అవుతుందని నమ్మకం ఉంది” అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు కమల్ కామరాజు, హర్షిత, దీక్ష పంత్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.