calender_icon.png 13 November, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫాలోఆన్ తప్పింది

18-12-2024 12:39:54 AM

* భారత్‌ను గట్టెక్కించిన బుమ్రా, ఆకాశ్ దీప్

  * తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252/9

* కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అర్థ శతకాలు 

* నేడు ఆటకు ఆఖరి రోజు

బ్రిస్బేన్: బోర్డర్. ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది. బ్రిస్బేన్ వేదికగా జరుగు తున్న మ్యాచ్‌లో టీమిండియా ఫాలోఆన్ గండం నుంచి సురక్షితంగా బయటపడిం ది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఆకాశ్ దీప్ (27*), బుమ్రా (10*) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు పదో వికెట్‌కు 39 పరుగులు జోడించి భారత్‌ను ఫాలోఆన్ ఉచ్చు నుంచి బయటపడేశారు. అంతకముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ (84) తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (77) హాఫ్ సెంచ రీలతో రాణించారు.

వివిధ సమయా ల్లో ఈ ఇద్దరు నిలబడకపోయుంటే భారత్ ఈ పాటికి ఓటమి అంచున నిలిచి ఉండేది. నేడు ఆటకు చివరి రోజు కావడంతో భారత్ ఆలౌటైన అనంతరం ఆసీస్ వేగంగా ఆడి భారత్‌ను బ్యాటింగ్‌కు దింపుతుందా అన్నది చూడాలి. వర్షం ముప్పు కూడా పొంచి ఉండడంతో మ్యాచ్ దాదాపు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

రాహుల్, జడ్డూ అదుర్స్..

51/4 క్రితం రోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడిన రోహిత్ (10) ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతిని అనవసరంగా ఆడి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించా డు. ఈ క్రమంలో అర్థసెంచరీ సాధించిన రాహుల్ ఆ ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించిన అనంతరం ఔటయ్యాడు.

ఆ తర్వాత ఓపికతో బ్యాటింగ్ చేసిన జడేజా నితీశ్ కుమార్‌తో కలిసి భారత్‌ను ఆదుకున్నాడు. అయితే వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు ఫాలోఆన్ ముపు తప్పదనిపించింది. అయితే ఈ దశలో టెయిలెండర్లు బుమ్రా, ఆకాశ్ దీప్ ఆసీస్ బౌలర్ల ను సమర్థంగా ఎదుర్కొన్నారు. రోజు ముగుస్తుందనగా కమిన్స్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన ఆకాశ్ భారత్‌ను ఫాలోఆన్ నుంచి తప్పించాడు. ఈ ఇద్దరు పదో వికెట్‌కు అజేయంగా 39 పరుగులు జోడించారు. అదే ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా ఆకాశ్  తరలించిన సిక్స్ హైలైట్‌గా నిలిచింది.