18-12-2024 12:36:07 AM
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజును తమిళనాడు ప్రభుత్వం మంగళవారం చెన్నైలోని కళైవరన్ అరంగమ్ భవన్‌లో ఘనంగా సత్కరించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం స్టాలిన్ గుకేశ్‌కు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల చెక్‌ను బహుమతిగా అందించారు. అనంతరం గుకేశ్ తాను సాధించిన ట్రోఫీని స్టాలిన్‌కు అందించాడు.
గుకేశ్ మాట్లాడుతూ..‘ప్రపంచ చాంపియన్‌గా ఈ వేదికపై నిలబడడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది. భవిష్యత్తులో తమిళనాడు నుంచి దేశానికి మరింత మంది గ్రాండ్‌మాస్టర్లు రావాలి’ అని చెప్పుకొచ్చాడు. కార్యక్రమంలో డిప్యూ టీ సీఎం ఉదయనిధి స్టాలిన్, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తదితరులు పాల్గొన్నా రు. అంతకముందు ఇంటి నుంచి ఓపెన్‌టాప్ కారులో బయల్దేరిన గుకేశ్‌కు రోడ్డుకు ఇరువైపులా అభిమానులు నీరాజనం పట్టారు.