26-07-2025 12:39:44 AM
కర్నూల్, జూలై 25: భారత్ రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) మరో విజయాన్ని అందుకుంది. డ్రోన్ ద్వారా యూఏ వీ లాంచ్‌డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్‌పీజీఎం)-వీ3ని విజయవంతంగా ప్రయో గించింది. కర్నూల్ జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో డీఆర్‌డీవోకు చెంది న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్‌వోఏఆర్)లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
క్షిపణి ప్రయోగ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘భారత క్షిపణి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తా జా ట్రయల్స్ దోహదపడనున్నాయి. యూ ఎల్‌పీజీఎం-వీ3 సిస్టమ్ అభివృద్ధిలో సహకరించిన డీసీపీపీలు, ఎంఎస్‌ఎంఈలు, ఇత ర స్టార్టప్‌లకు కృతజ్ఞతలు.
ఈ పరీక్ష భారత్ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచింది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డ్రోన్ క్షిపణి పరీక్ష విజ యవంతం కావడమంటే.. భారతీయ పరిశ్రమ కీలకమైన రక్షణ టెక్నాలజీ ఉత్పత్తుల్ని తయారీ చేసేందుకు సిద్ధమైనట్టే’ అని రాజ్‌నాథ్ తెలిపారు.
యూఎల్‌పీజీఎం-వీ3
మిసైల్ ప్రత్యేకతలు:
* హై డెఫినిషన్ డ్యూయల్ చానల్ సీకర్. ఇది ప్రతిరోజు రాత్రి వేళల్లో లక్ష్యాలను గుర్తించి ఆపరేట్ చేయగలదు
* రెండు దిశల డేటా లింక్ సదుపాయం ద్వారా టార్గెట్‌ను ప్రయోగం తర్వాత కూడా అప్‌డేట్ చేయవచ్చు.
మూడు రకాల వార్‌హెడ్ మాడ్యూల్స్:
* యాంటీ ఆర్మర్- ఆధునిక ట్యాంకులపై దాడికి
* పెనట్రేషన్ కమ్ బ్లాస్ట్- బంకర్‌లను చీల్చేందుకు
* ఫ్రీ-ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్- విస్తృత ప్రభావంతో లక్ష్యాలను తుడిచివేయగల సామర్థ్యం
ఈ ప్రాజెక్టును డీఆర్‌డీవోకి చెందిన పలు ల్యాబ్‌లు కలిసి అభివృద్ధి చేశాయి. ఇమారత్ రీసెర్చీ సెంటర్, డీఆర్‌డీఎల్, టెర్మినల్ బాలిస్టిక్స్ ల్యాబ్, హై ఎనర్జీ మెటీరియల్స్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి.
ఈ ప్రయోగంలో యాంటీ ఆర్మర్ వార్‌హెడ్ మోడల్‌ను పరీక్షించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ మిసైల్‌ను ప్రయోగించిన యూఏవీ కూడా బెంగళూరుకు చెందిన భారతీయ స్టార్టప్ రీసెర్చ్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టుకు అడాని డిఫెన్స్, భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), 30 ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు సహకరించాయి.
ఏమిటీ యూఎల్‌పీజీఎం-వీ3 మిసైల్?
యూఎల్‌పీజీఎం శ్రేణి ఆయుధాలను తపస్-బీహెచ్, ఆర్చర్ ఎన్‌జీ యూఏవీ (అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికల్స్)ల కోసం అభివృద్ధి చేశారు. ఇది చాలా తక్కువ ధరతో ఉత్పత్తి చేయవచ్చు. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అత్యంత సమీపం నుంచి జరిగే పోరాటాల్లో ఫైర్ అండ్ ఫర్‌గెట్ వ్యవస్థ ఆధారంగా దీనిని ప్రయోగించవచ్చు. ఈ ఆయుధం ఫిక్స్‌డ్ వింగ్ మానవ రహిత విమానాలను కూల్చేందుకు వినియోగిస్తారు.