26-07-2025 12:38:48 AM
ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడో
కరీంనగర్, జూలై 25 (విజయ క్రాంతి): స్థానిక సంస్థలు సెప్టెంబర్ లోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ప్రభు త్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పా స్ చేసి గవర్నర్, రాష్ట్రపతి ఆమోదానికి పం పించినప్పటికి ఇంకా ఆ దిశగా కేంద్రం నిర్ణ యం తీసుకోకపోవడం, ఈ క్రమంలోనే కాం గ్రెస్, బీజేపీ అగ్రనేతల మాటలయుద్ధం కొనసాగుతుండడంతో స్థానిక పోరు అనుకున్న సమయానికి జరిగేనా అన్న ఉత్కంఠ నెలకొంది.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలైతే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొ త్తం 1229 గ్రామ పంచాయతీలు ఉండగా రిజర్వేషన్ అమలైతే 516 స్థానాలు బీసీలకు దక్కుతాయి. జిల్లాల వారీగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 15 ఉండగా బీసీలకు 6, జగిత్యాల జిల్లాలో 20 ఉండగా బీసీలకు 8, పెద్దపల్లి జిల్లాలో 14 ఉండగా 6, రాజన్న సిరిసిల్ల జి ల్లాలో 12 ఉండగా 5, మొత్తంగా 61 జడ్పీటీసీ స్థానాల్లో 25 స్థానాలకు బీసీలకు ద క్కుతాయి.
ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాలో 170 ఎంపీటీసీ స్థా నాలు ఉండగా బీసీలకు 71, జగిత్యాల జిల్లా లో 216 ఉండగా 91, పెద్దపల్లి జిల్లాలో 137 ఉండగా 58, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 123 ఉండగా 52 స్థానాలు బీసీలకు దక్కనున్నాయి. మొత్తంగా 646 ఎంపీటీసీ స్థానాల్లో 272 స్థానాలు బీసీలకు దక్కుతాయి. సర్పం చ్ ఎన్నికల విషయం తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో మొత్తం 318 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఇందులో బీసీలకు 133 స్థానాలు దక్కుతాయి. జగిత్యాల జిల్లాలో 385కు 162, పెద్దపల్లి జిల్లాలో 266కు 112, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 పంచాయతీలకు 109 స్థానాలు బీసీలకు దక్కనున్నాయి. ఇప్పటికే స్థానిక నియోజకవర్గాల్లో జనాభా ఆధారంగా బీసీ గణన ఆధారంగా రిజర్వ్ స్థానాలు మాకే దక్కుతాయన్న ఆశతో బీసీ నేతలు ఆయా పార్టీల నుండి టికెట్లు ఆశిస్తున్నా రు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీలు ఇప్పటికే ఆయా జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆయా జిల్లా అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించి కసరత్తును ప్రారంభించారు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వస్తే ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం గా ఉంది. అయితే నోటఫికేషన్ ఈ నెల చివరికి వస్తుందా, ఆగస్టు మొదటి వారంలో వస్తుందాచూడాలి.