11 August, 2026 | 1:40 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

బాలిక అదృశ్యం

16-06-2025 11:32 PM

ఇబ్రహీంపట్నం: బాలిక అదృశ్యమైన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌(Adibatla Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, కూర్మల్ గూడలోని ఇంద్రా నగర్ కాలనీకి చెందిన కోవటి యశస్వినీ (18), 9వ తరగతి వరకు చదివి, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నది. ఆదివారం యశస్వినీ ఇంట్లో వదిలి, తల్లిదండ్రులు ఫంక్షన్ కి వెళ్ళారు. తిరిగి అర్థరాత్రి 12.30 గంటలకు వచ్చి చూడగా అమ్మాయి ఇంట్లో కనిపించలేదు.

చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయి ఎత్తు: 5 అడుగులు, తెలుపు రంగు, తెలుగు, హింది భాషలు మాట్లాడగలదు. ఆచూకీ తెలిసిన వారు ఆదిభట్ల పోలీసు స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.