calender_icon.png 8 August, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలన

08-08-2025 01:49:23 AM

విజయ క్రాంతి కథనానికి కదిలిన అధికారులు 

రేవల్లి : ఆగస్టు7:  గురువారం విజయక్రాంతి దినపత్రికలో రేవల్లికి చేరని మిషన్ భగీరథ నీళ్లు కథనానికి మిషన్ భగీరథ గ్రిడ్ డీఇ విజయ్ కుమార్, ఇంట్రా డీఇ హరీష్ ల ఆధ్వర్యంలో ఇంట్ర మరియు గ్రిడ్ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి గ్రామంలో  మిషన్ భగీరథ నీటి సరఫరా తీరుతేన్నులను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడగ గ్రామంలో అనాది నుంచి బోర్ నీళ్లు మాత్రమే తాగుతున్నామని ఈ మధ్యలో మిషన్ భగీరథ నీళ్లు తోడైన ఎక్కువగా స్కీమ్ బోర్ నీళ్ళని మంచినీల్లుగా పంచాయతీ అధికారులు అందిస్తున్నారని గ్రామస్తులు వారి దృష్టి  తీసుకెళ్లారు,

ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ గ్రామానికి కావాల్సినన్ని మిషన్ భగీరథ శుద్ధి చేసిన జనాలు అందించడానికి ఇంట్రా మరియు గ్రేడ్ లు సిద్ధంగా ఉన్నాయని గ్రామస్తులు ఎవరు ఆందోళన చెందవద్దని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు అక్కడికక్కడే సమీక్షించి కింది స్థాయి అధికారులకు సరఫరా సమయాలను అనుసరించాల్సిన విధివిధానాలను తెలిపారు,

ప్రతిరోజు గ్రామాన్ని సందర్శించి మంచినీటి సరఫరాను పరిశీలించినట్లు వారి సందర్భంగా గ్రామస్తులకు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఏఈలు రాకేష్, తిరుపతయ్య,పర్యవేక్ష కులు కుర్మయ్య, బాలరాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.  ఫోటో రైటప్ :  రేవల్లిలో గ్రామస్తులతో మాట్లాడుతున్న మిషన్ భగీథ అధికారులు