08-08-2025 01:47:50 AM
అయిజ, ఆగస్టు 07: గద్వాల జిల్లా అయిజ మండల కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్వ రంగస్వామి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన కురువ రంగస్వామి గురువారం ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ ద్వారా తన అన్న వినోద్ కు సమాచారం ఇచ్చాడు. దీంతో వినోద్ వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్త్స్ర శ్రీనివాస్ సూచన మేరకు డ్యూటీ లో ఉన్న సిబ్బంది రవి,రమణ సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా రంగస్వామి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అతని వద్దకు చేరుకున్నారు. పురుగు మందు డబ్బాతో కనిపించిన యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి వెంటనే హాస్పిటల్ కి తరలించారు.100కు డయల్ చేయగా వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బంది రవి, రమణ ను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు