24-05-2025 11:45:13 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): శ్రీ సాయి హై స్కూల్ విద్యార్థి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో 95/100 మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో సాధించాడు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంకి చెందిన విద్యార్థి మంగ నిరంజన్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్గురి ఫైన్ ఆర్ట్స్ గురుకుల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలలో 210 ఉత్తీర్ణత అయ్యారు. అందులో మంగ నిరంజన్ మొదటి స్థానం సాధించాడు.
ఈ పరీక్ష ద్వారా తబలా, పియానో, డాన్స్, పెయింటింగ్స్ తదితర లలిత కళలలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మే 12న జరిగిన 1 - 10 స్క్రీనింగ్ టెస్ట్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి హై స్కూల్ ఉపాద్యాయుల శిక్షణతో విజయం సాధించిన విద్యార్థి, గోర్గల్ కు చెందిన మంగ నిరంజన్ 95/100 మార్కులతో సత్తా చాటి టాపర్గా నిలిచాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిజాంసాగర్ ఎంఇఓ తిరుపతి రెడ్డి, మహ్మద్ నగర్ ఎంఇఓ అమర్ సింగ్ , పాఠశాల కరస్పాండెంట్ భార్గవ్ సార్ విద్యార్ధిని ఘనంగా సన్మానించి మేమెంటో అందజేశారు.అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధిని అభినందించారు.