calender_icon.png 15 August, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

15-08-2025 10:20:15 AM

  1. లారీని వెనకనుంచి ఢీకొట్టిన సిజిఆర్ వోల్వో బస్సు
  2. ముగ్గురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
  3. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలు 
  4. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల(Jadcherla Road Accident) సమీపంలోని ఎన్ హెచ్ 44 మాచారం ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. సీఐ కమలాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిజిఆర్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు, లోడుతో లారీ హైదరాబాద్ వైపు వెళుతున్నాయి. జడ్చర్ల సమీపం లో మాచారం బ్రిడ్జి ప్రారంభంలో  30 నుంచి 40 వేగం బయలుదేరుతున్నట్లు  తెలుస్తుంది.  వెనకనుంచి వచ్చిన సిజిఆర్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా లారీని వెనకనుంచి ఢీ కొట్టింది.

దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు పరిస్థితి తీవ్ర విషమంగా ఉండగా మరో పదకొండు మందికి గాయాలు అయ్యాయి. బస్సు డ్రైవర్ తో పాటు మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నారు. హైదరాబాదులోని కుక్కట్ పల్లి ప్రాంతానికి చెందిన రాధిక (45), లక్ష్మీదేవి (65) గుర్తించడంతోపాటు ఇరువురు అత్త కోడళ్ళు. మృతదేహాలను జిల్లా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం చేరవేయడంతో పాటు  క్షతగాత్రులను జడ్చర్ల ఆస్పత్రిలో వైద్య చికిత్సలు అందించేందుకు  పంపించడం జరిగింది. పూర్తిస్థాయిలో ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కమలాకర్ తెలియజేశారు. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే..

జడ్చర్ల సమీపంలోని మాచారం దగ్గర జరిగిన సంఘటన స్థలానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) చేరుకొని ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ కమలాకర్ లను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.