15-08-2025 11:06:12 AM
పోలీసులకు ప్రశంస పత్రాలు అందజేసిన సబ్ కలెక్టర్ మనోజ్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. వాడవాడలా పంద్రాగస్టు సంబరాలు మార్మోగాయి. ప్రభుత్వ ప్రైవేటు, గనులు డిపార్ట్మెంట్లు, కార్మిక సంఘాల కార్యాలయలపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ మనోజ్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తాహసిల్దార్ ఎల్ కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయంలో రవి ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బెల్లంపల్లి హెడ్ క్వార్టర్ లో ఆర్ ఐ సంపత్ జెండా ఆవిష్కరించారు. సీపీఐ, సిపిఎం, బిజెపి, ఏఐటీయూసీ, సిఐటియు, టిఎన్టియుసి, టీబీజీకేఎస్ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు.
పోలీసులకు ప్రశంస పత్రాలు అందజేత..
స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పోలీసుకి ప్రశంస పత్రాలు అందజేశారు. తాండూరు మండలం నర్సాపూర్ లో గర్భిణీ వాగు దాటించి సకాలంలో ఆసుపత్రికి పంపించినందుకు తాండూర్, మాదారం ఎస్సైలు కిరణ్, సౌజన్య, పోలీసులు, 108 సిబ్బంది, అంగన్వాడీలకు ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు.
గనులపై పంద్రాగస్టు వేడుకలు..
శాంతిఖని, సింగరేణి ఏరియా ఆసుపత్రి లో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. డివై సీఎమ్ఓ మధుకర్, శాంతిఖని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా జెండావిష్కరించారు. ఏఐటీయూసీ, ఐఎన్టియూసీ, టీబీజీకేఎస్ సిఐటీయూ నాయకులు జండా విష్కరణ చేసి స్వాతంత్ర వేడుకలు జరిపారు.