15-08-2025 11:03:18 AM
మునగాల,(విజయక్రాంతి): పురుగుల మందు తాగి యువ రైతు మృతి చెందిన సంఘటన మండల కేంద్రం లో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సిరికొండ రాజేష్(40) తండ్రి వెంకటేశ్వర్లు అతడికి భార్య సునీత.వృత్తి గృహిణి ముగ్గురు పిల్లలు.మునగాల గ్రామానికి చెందిన దేవరం వెంకట్ రెడ్డి (లిఫ్ట్ వెంకట్ రెడ్డి) భరాఖత్ గూడెం గ్రామానికి చెందిన బొంతు విజయ్ కుమార్,(పెద్దబ్బాయ్) అనే వారు గత కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్ స్టార్టర్లు, మోటార్లు దొంగతనం చేశాడు అని మృతుడిపై మునగాల పోలీసు స్టేషన్ నందు దొంగతనం ఆరోపణలతో ఫిర్యాదు చేయగా ఇట్టి విషయం తెలుసుకున్న మృతుడు అవమానకరంగా భావించి తన పొలం దగ్గరకు వెళ్ళి తన చావుకి దేవరం వెంకట్ రెడ్డి కారణం అని ఒక సెల్ఫీ వీడియో తీసుకుని తదుపరి గడ్డి మందు ఎక్కువ మోతాదులో త్రాగి , ఇదే విషయం తన భార్య సునీత, బావామరిది సైదులు కి ఫోన్ చేసి చెప్పగా వారు హుటాహుటిన సంఘటనా స్థలం వద్దకు వచ్చి మృతుడిని ఒక ప్రైవేట్ వెహికిల్ లో ముందుగా కోదాడ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు,ఆ తరువాత ఖమ్మం లోని శ్రీ రక్షా అనే ప్రైవేట్ హాస్పిటల్ కు మెరుగైన చికిత్స కోసం తరలించగా మృతుడు చికిత్స పొందుతూ గత రాత్రి చనిపోయినాడు.
శవమును కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి . మృతుడి భార్య సిరికొండ సునీత ఫిర్యాదు మేరకు మునగాల సి ఐ. రామకృష్ణా రెడ్డి పర్యవేక్షణ లో వెంకట్ రెడ్డి. విజయ కుమారులపై ఎస్ఐ కేసు నమోదు చేసి.అనంతరం మృతదేహంను భందువులకు అప్పగించినారు. అనంతరం గ్రామం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండాముందుజాగ్రత్తగాఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మునగాల, హుజూర్ నగర్, కోదాడ రూరల్ సి ఐ లు తమ పరిధిలోని స్టేషన్ యస్ ఐ లు, సిబ్బందితో బందోబస్త్ నిర్వహించి అంత్యక్రియలు సాఫీ గా జరగటానికి కృషి చేసినారు అని యస్ఐ ఒక పత్రికా ప్రకటనలో తెలిపినారు.