15-08-2025 10:24:29 AM
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా వందనం చేసిన ఎమ్మెల్యే మదన్మోహన్.
ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): ఎందరో మహానుభావులు ఎందరెందరి త్యాగఫలము, తమ ప్రాణాలను, సైతం లెక్కచేయకుండా స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నందుకు నేడు స్వాతంత్ర దినోత్సవ (Independence Day 2025) జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్(MLA Madan Mohan), ఎల్లారెడ్డి నియోజకవర్గ అధికారులతో నాయకులతో కార్యకర్తలతో క్యాం కార్యాలయంలో జెండా వందనం చేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని.. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.
శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు పోరాటం చేశారని, వారి త్యాగాలకు ప్రతిరూపకంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని గుర్తుకు చేశారు. మహనీయుల స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, ఏఎంసి చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కురుమల సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసిలు ఉషా గౌడ్, నాగిరెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ గౌడ్, రామచంద్ర రెడ్డి, తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.