01-11-2025 12:00:00 AM
రూ. లక్ష ఎన్‌ఓసి అందజేసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
భీంగల్, అక్టోబర్31 (విజయక్రాంతి): మండలంలోని బాబా పూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హయత్ ఇటీవల యాక్సిడెంట్ కి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి ఆర్థిక సహాయ విషయమై నివేదించారు.
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు 1 లక్షల రూపాయల ఎన్ ఓ సి మంజూరు చేయించి ఎల్ ఓ సి కాపీ ని వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం హైదరా బాద్‌లోని తన నివాసంలో ప్రశాంత్ రెడ్డి అందజేశారు.
నిరుపేదలమైన మాకు మెరు గైన వైద్య చికిత్స కొరకు 1 లక్ష రూపా యల ఎల్‌ఓసి మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజి మంత్రి, ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు తెలిపారు.