calender_icon.png 22 September, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే బండ్ల

22-09-2025 12:30:15 AM

అలంపూర్, సెప్టెంబర్ 21:గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదివారం తన జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మే శ్వరస్వామి స్వామి ఆలయాలను దర్శించుకున్నారు.వీరికి అర్చకులు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

మొదటగా స్వామి వారికి అభిషేకాలు చేసి జోగుళాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం చండీ హోమా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఎ మ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి వారి కుమారుడు బండ్ల సాకేత్ రెడ్డి పాల్గొన్నారు