22-09-2025 12:29:36 AM
* పచ్చని ప్రకృతి.. మన తరతరాల ఆస్తి
* భావితరాలకు మనం ఇచ్చే సంపద
* మానవ మృగాలతో.. ప్రభుత్వ అధికారుల కుమ్మకు
* పచ్చని ప్రకృతి మాయం
* కన్నీళ్లు పెడుతున్న భూతల్లి
ఎర్రుపాలెం సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): ప్రకృతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మానవ మృగాలతో విసిగిపోయిన భూతల్లి రోదన అరణ్య రోదన లాగా వినిపిస్తోంది..అడవిలోని పెద్ద జంతువు .. తన ఆహారం కొరకు చిన్న జంతువులను చం పి తినడం అటవీ న్యాయం. కానీ నేటి మానవుడు తోడేళ్లు లాగా తన స్వార్థం కొరకు ప్రకృతిలోని కొండలు , గుట్టలను స్వాహా చేస్తూ ప్రకృతిపై పగ తీర్చుకుంటున్నాడు. ప్రకృతి సంపదను దోచుకుంటున్నాడు.
ప్రభుత్వ అధికారులు మానవ మృగాలతో కలిసి అందిన కాడికి దోచుకో మని మౌనం వహిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ సంపదను కోట్లలో దోచుకుం టున్నారు. మమ్మల్ని అడిగే వారు ఎవరిని మా వెనుక ప్ర భుత్వ అధికారులు మమ్మల్ని కాపాడతారని మాకు నదు రూ బెదురు లేదని ప్రకృతి సంపదను కుమ్మేస్తామని రెచ్చిపోతున్నారు. ఎర్రుపాలెం మండలం పచ్చని కొండలు, పచ్చని గు ట్టలు ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి చూడ ముచ్చటగా ప్రజలకు కనువిందుగా ఉన్నది.
అలాంటి పచ్చని ప్రకృతిపై మట్టి మాఫియా కన్ను పడి పచ్చని గుట్టలను కొండలను తమ ఇష్టానుసారం తొవ్వుకుంటూ కనుచూపు మేరకు పచ్చని గుట్టలను మాయం చేస్తున్నారు. నిత్యం ప్రోక్లైన్లు తో వందలాది లా రీలతో రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తోవ్వుకొని పోతున్నారు. మండలంలోని భీమవరం, నరసింహపురం ,జమలా పురం ,వెంకటాపురం, గ్రామాలు పచ్చని మణిహారం లాగా ఉన్నాయి.
అలాంటి గ్రామాలలోని కొండలను గుట్టలను మట్టి మైనింగ్ మాఫియా తొవ్వుకుంటూ గ్రామాల రూపురేఖలను మార్చుకుంటూ పోతున్నారు. పచ్చని ప్రకృతి తో ఉన్న ఈ గ్రామాలలో వెంబటి రోడ్ల పైన మట్టి తూలకాలను నిత్యం లారీల లో టన్నుల కొద్ది మట్టి తరలించకపోతున్నారు. లారీల స్పీడుతో రోడ్ల పైన ఉన్న దుమ్ము గ్రామాలపై పడి పచ్చని పొ లాలు ఎర్రగా మారుతున్నాయి. ఆ దుమ్ము, ధూళి, ఇండ్ల పైన పడి ఇళ్ల రూప రేఖలు మారుతున్నాయి.
పచ్చని గాలి కలిసి తమైపోయి ప్రజల రోగాల బారిన పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక అటవీ కార్యక్రమాలు ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు హరితహారం, ప్రకృతి వనాలను వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి సామాజిక అడవులను పెంచేందుకై ప్రభుత్వం ఒకపక్క కృషి చేస్తుంటే కొంతమంది తమ స్వార్థం కొరకు అడవులను గుట్టలను తమ ఇష్టానుసారం ప్రభుత్వ కొద్దిపాటి అనుమతితో మరింత తొ వ్వుకొని ప్రకృతి వినాశనానికి కారకలవుతున్నారు.
వీరికి తోడు ప్రకృతి సంపదను కాపాడవలసిన ప్రభుత్వ అధికారు లు మట్టి మైనింగ్ మాఫియా తో చేతులు కలిపి చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంవల్ల ప్రకృతి సంపద ఆవిరై పోతున్నది. ప్రభుత్వానికి రావలసిన విలువైన సంపద కొంతమంది స్వార్థం వలన ఇతర రాష్ట్రాలకు మట్టిని తోలుకుపోయి తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గ్రా మాలలో ప్రజలకు ప్రకృతి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
కానీ ప్రకృతిని నాశనం చేయడం వలన గ్రామాలలోని ప్రజలకు దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మట్టిని ఇష్టానుసారంగా తొవ్వుకు పోయే వారిని, అక్రమ మట్టి మైనింగ్ మాఫియాను అరికట్టి మండలాన్ని, గ్రామాలను కాపాడాలని, ప్రకృతి సంపద భావితరాల వరకు అందించే బాధ్యత మన అందరిపై ఉన్నదని, ప్రకృతి సంపదను తరలించకపోయే వారిపై ఉక్కు పాదం మోపాలని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని మండల ప్రజలు కోరుతున్నారు.