22-09-2025 12:31:31 AM
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు అనంత రా ములు అన్నారు. ఆదివారం శివ మార్కండేయ దేవాలయం భవనంలో పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ జరిగిన కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం నిత్యం కొండ లక్ష్మణ్ బాపూజీ ఎంతో పరితపించారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత పదవుల కోసం పాకులాడకుండా నీతి నిజాయితీతో తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప మహనీయుడన్నారు. లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బాలరాజ్, సూర్య ప్రతాప్, సుకుమార్, కిషోర్, భీంపల్లి శ్రీకాంత్, భోగం శివాజీ, బాలకృష్ణ కొంగరి వెంకటేష్, రాఘవేందర్, నరేష్, కోడి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.