10-02-2026 06:25:04 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లోని చాణిక్యపురి కాలనీలో అండర్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఇచ్చే హామీలను నెరవేర్చడమైన తన లక్ష్యం అన్నారు. ప్రజా సమస్యలు వారి మౌలిక వసతులను నెరవేర్చడమేతనధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో చాణిక్యపురి వెల్పర్ అసోసియేషన్ నాయకులు దశరథ్ దూశెట్టి కిషోర్ గౌడ్ గంధమల రాములు తదితరులు పాల్గొన్నారు.