ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఆలస్యమైన నాణ్యమైన చీరలు అందిస్తున్నాం..
మహిళలను ప్రోత్సహించడం ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం..
నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం..
చిట్యాల (విజయక్రాంతి): మహిళలను ప్రోత్సహించడం ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం అని, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల, రామన్నపేట, నార్కట్ పల్లి మండాలాలకి సంబంధించిన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి చీరలను స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆయన శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొద్దిగా ఆలస్యమైనా తెలంగాణ ఆడబిడ్డలకు మంచి నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ తెలంగాణ ఆడబిడ్డకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం అని అన్నారు. గతపాలనలో, ప్రాజెక్టుల పైనే కాకుండా చీరలపై కూడా దోపిడి చేసి 8 లక్షల కోట్ల అప్పుచేసి రాష్టాన్ని దోచుకున్నారని విమర్శించారు.
ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు, 200 యునిట్ ల వరకు ఫ్రీ కరెంట్, కాకుండా మహిళకు వడ్డీలేని రుణాలు కూడా ఇస్తున్నామని, ఆర్థికంగా మహిళలను ప్రోత్సహించడం మన ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. జైలు నుండి తన బిడ్డ పెళ్లికి వచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అయిన కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని పైకెదిగిన గొప్ప వ్యక్తి అని, ఆయనకు పేదలన్నా సామాన్యులన్నా బాగా ఇష్టపడుతాడు వారికి ఏ కష్టం రాకుండా చూడాలంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాస్ రావు, చిట్యాల తహసిల్దార్ బి. విజయ, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, పోకల దేవదాస్, మార్కెట్ చైర్మన్ నర్రా వినోద - మోహన్ రెడ్డి, పాక్స్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం, జడల మల్లయ్య, గుడిపాటి లక్ష్మీనరసింహ, మాజీ ఎంపిటిసి ఎద్దులపూడి కృష్ణ, జనగాం రవీందర్ గౌడ్, అంతటి పారిజాత నరసింహ గౌడ్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






